సాయి కరుణతో నేను వ్రాయడం మొదలు పెట్టాను. ఆ భగవానుని దయ నా అభివృద్ధికి తోడ్పడుతుందని నా నమ్మకం. ముందు వ్రాసిన మాట తూర్పున సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఆ మాటతో కథ ప్రారంభం చేయాలనిపించింది. ఎందుకంటే... అసలు మనిషికి, తూర్పుకీ చాలా అవినాభావ సంబంధం ఉంది. మనిషి లేచింది మొదలుగా తూర్పు అనే పదం అవసరంగా కనిపిస్తోంది. ఒక మంచి పని చేయాలన్నా, తూర్పుకి తిరిగి చేయమంటారు. ఒక మంచి మాట వ్రాయాలన్నా తూర్పుకి తిరిగి మొదలు పెట్టమంటారు. ప్రతీ శుభకార్యానికి తూర్పు తిరిగి చేయమంటారు మన పెద్దలు, పండితులు. తూర్పుకి తిరిగి చేసిన పనికి మంచి ఫలితం ఉంటుందని మన ప్రాంతాల వారి నమ్మకం. ఇలా మన దినచర్యకు, తూర్పుకు చాలా పటిష్టమైన అవినాభావ సంబంధం ఉంది. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. అది వేరే చెప్పనక్కరలేదు. కానీ... సూర్యుడు ఉదయించాడంటే కాలగర్భంలో ఒక రోజు కలసిపోయిందనే, మరలి రాదనీ ఇంకో రోజు మొదలయ్యిందనీ, చేయాలనుకున్న మంచి పనులు చేయకుండా బద్దకిస్తే పొద్దు వెళ్ళిపోతుందని చీకటి పడిపోతుందని చెప్పేదే దినకరుని రాక. సూర్యుని వెలుగు భూమి మీదకు రాగానే పుడమి పులకరిస్తుంది. కమలం కదలి ఆడుతుంది. ఉషోదయ కిరణాల వెలుగుకు ప్రతీ జీవికి నూతన ఉత్&